28-07-2025 01:10:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): హెపటైటిస్ వ్యాధిని నిర్లక్ష్యం చే యడం వల్ల అనేక మంది మరణిస్తున్నారని కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.శ్రీకాంత్ పేర్కొన్నారు. హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మా ట్లాడుతూ.. ‘హెపటైటిస్ మరణాల్లో ఎక్కువగా 55 ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కలుషితమైన ఆహా రం, నీరు తీసుకోవడం వల్ల ఒక రకమైన హెపటైటిస్ వ్యాధి సోకుతుంది.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ ఇలా ఐదు రకాల వైర ల్ హెపటైటిస్‌లు ఉన్నాయి. 5 రకాల వైరస్‌ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వీటన్నిటిలోనూ, హె పటైటిస్ ఏ, ఈ కలుషితమైన నీరు లేదా ఆహా రం ద్వారా వ్యాపిస్తాయి, హెపటైటి స్ బీ, సీలు సాధారణంగా రక్త మార్పిడి లేదా లైంగిక సంప ర్కం ద్వారా వ్యాపిస్తాయి’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలలో కోటి 30 లక్షలమంది హెపటైటిస్‌తో చనిపోయారు.
వీరి లో 87 శాతం మం ది హెపటైటిస్ బీ కారణం గా చనిపోగా, 17% మంది హెపటైటిస్ సీ వల్ల మృతి చెందా రు. వైరల్ హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ రేటు కూడా ఇండియాలో చాలా తక్కు వగా ఉంది. మొత్తం హెపటైటిస్ రోగులలో 2.4% హెపటైటిస్ బీతోనూ, 28% మంది హెపటైటిస్ సీతోనూ బాధపడుతున్నారు’ అని వివరించారు. మద్యపానం, కొన్నిరకాల డ్రగ్స్, ఇతర వ్యాధులు హెపటైటిస్ సోకడానికి కారణమవచ్చని.
హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ‘లివర్ సిరోసిస్’, లివర్ కాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ‘వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 15 ఏండ్ల పాటు రక్షణ ఉంటుంది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేస్తారు. ‘మద్య రహిత ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతోంది. పాతిక శాతం మంది రోగులు ఈ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. జీవన శైలి మారడం, స్థూలకాయమే ఇందుకు కారణం’ అని తెలిపారు.