10-07-2025 12:24:55 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి)/ముషీరాబాద్/శేరిలింగంపల్లి : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం దేశ వ్యాప్త కార్మికుల సమ్మెలో భాగం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ, సర్వీస్ రంగ కార్మిక, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్‌ఐసీ తదితర కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఈ సమ్మెలో దాదా పు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారని చెప్పారు. 8 గంటల పని హక్కును మార్పు చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించగా, వ్యతిరేకించాల్సిన తెలంగాణ ప్రభుత్వం కూడా రోజుకు 10 గంటలు పని చేయాలని సర్క్యులర్ జారీచేయడం దారుణమన్నారు.
బ్యాంకింగ్ రంగం ప్రభు త్వం చేతిల్లో ఉండటం వలన ఆపదకాలంలో ఉపయోగపడ్డాయన్నారు. ఇప్పుడు బ్యాంకులన్ని విలీనం చేసి దానిలో పనిచేసే సిబ్బం దిని 8 లక్షలకు కుదించారని, 25 లక్షల మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బ్యాంకిం గ్ రంగంలో ఉన్నారని పేర్కొన్నారు.
ఎల్‌ఐసీలో 12 లక్షల మంది ఉద్యోగులుండగా ప్రస్తుతం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పరిమితమయ్యారని, సింగరేణిలో లక్ష 16 వేల మంది ఉంటే ఇప్పుడు 35 వేల మంది దిగిపోయారని వివరించారు. రైల్వే ను, అత్యంత సున్నితమైన రక్షణ రంగాన్ని ప్రవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో నరేంద్రమోదీకి సహాయపడిన అదాని, అంబానీలు కూడా ప్రధాని పక్కన కూర్చొమని పాలన సాగిస్తారని మండిపడ్డారు.
గ్రామపంచాయతీ కార్మికులకు 5 నెలల నుంచి జీతాలు లేవని, కొన్ని గ్రామపంచాయతీలు ఎక్కువ జీతాలు ఇస్తుంటే ఇవ్వకూదని సర్క్యులర్ జారీ చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నారాయ ణగూడ లో ఐఎన్‌టీయూసీ తెలంగాణ కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించింది.
ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్‌డి చంద్రశేఖర్, ఎరగాని నాగన్న గౌడ్, ఆదిల్ షరీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమా నాగేంద్ర మణి, విజయ్ కుమార్ యాదవ్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లేష్ గౌడ్, కే. రాజు రెడ్డి, అబ్రహం, కొండ అన్నపూర్ణ, శ్రీదేవి, శ్రీనివాస్ గౌడ్, ప్రణీత్ కుమార్, విఎస్టీ పౌల్ శ్రీనివాస్, పోస్టల్ లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ నాయక్, యాదయ్య, ప్రభాకర్, లక్ష్మయ్య, హమీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్‌లో వివిధ వామపక్ష సంఘాల నాయ కులు, సిఐటియు జిల్లా నాయకులు చల్లా శోభన్,రాములు, మురళి,దశరథ నాయక్, నాగమణి, శ్రీలత, నీరజ,నిర్మల తదితరులు పాల్గొన్నారు. గాంధీ నగర్ లోని ఎల్‌ఐసి డివిజనల్ ఆఫీస్ ప్రాంగణంలో ఒక్కరోజు సమ్మె జరిగింది. సుమారు 200 మంది ఉద్యోగులు పట్టణ ప్రాంతంలోని వివిధ ఎల్‌ఐసి కార్యాలయాల నుంచి తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీ.సతీష్ అధ్యక్షుడు జీ.తిరుపతయ్య సంయుక్త కార్యదర్శి, రాజేష్ సింగ్ సహకోశాధికారి, ఎస్సీ జెడ్‌ఐఈఎఫ్ పాల్గొన్నారు. ఈ సమ్మె ఉద్దేశించి పీ.సతీష్, ఐసీఈయూ సికింద్రా బాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. గుణశేఖర్, డి. ఎస్ రఘు, కార్యవర్గ సభ్యులు బి. ప్రభాకర్, హెచ్ ఎస్ చంద్రశేఖర్, వివేక్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.