calender_icon.png 10 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెక్కల కష్టం కుక్కల పాలు

10-07-2025 12:23:08 AM

- గొర్రెల మందల పై కుక్కల దాడి 

- 25 గొర్రెలు మృతి 

- మృతి చెందిన గొర్రెలను చూసి బాధిత రైతుల రోదనలు

రంగారెడ్డి, జులై 9,( విజయక్రాంతి ): గ్రామాలలో వీధి కుక్కల బెడద వల్ల మూగజీవాలకు రక్షణ కరువైంది. పల్లెల్లో కోళ్ల ఫా మ్ ల వద్ద చికెన్ వ్యర్థాలు, చనిపోయిన కోళ్ల ను తింటూ పల్లెల్లో గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తున్నాయి. అట్టి సమయం లో ఒంటరిగా ఉన్న పిల్లలు, పెద్దల తో పా టు మూగజీవాలను కూడా టార్గెట్ చేసుకుని దాడులకు దిగి తీవ్రంగా గాయపరు స్తున్నాయి. కుక్కల కు మాంసం అందుబాటులేకపోతే పశువుల దొడ్ల వద్ద కాపు కాస్త దాడులకు దిగుతున్నాయి.

ఇలాంటి ఘటనలు జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటు న్నాయి. తాజాగా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో చౌలపల్లి గ్రామంలో ఒక గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేసి 25 గొర్రెలను మెడలు కొరికి చంపాయి. కొన్ని జీవాల్ల ను అక్కడే చంపి తిన్నాయి. గ్రా మానికి చెందిన రైతు ఎలిగా పల్లి కృష్ణయ్య గత కొంతకాలంగా గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు. రోజువారి విధంగా గొర్రెలను దొడ్డిలో తోలి అన్నం తినేందుకు ఇంటికి వెళ్ళాడు.

ఇదే సమయంలో కుక్కల మంద ఒక్కసారి గా గొర్రెల మంద పై దాడి చేయడంతో గొర్రెలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకొని బాధిత రైతు మృతి చెందిన గొర్రెలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. గొర్రెలు మృతి చెందడంతో దా దాపుగా రెండు లక్షల వరకు నష్టం వాట్టిల్లీందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నియో జకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరా మర్శించారు. 

వీధి కుక్కలను అరికట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయని పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు తక్షణమే వీధి కుక్కలను అరికట్టాలని అధికారులను కోరారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.