calender_icon.png 10 September, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ నిర్ణయం పత్తి రైతుకు శాపం

09-09-2025 01:08:03 AM

ఏఐసీసీ నాయకులు నుమాన్ మహమ్మద్

ఖైరతాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తు న్నాయని ఏఐసీసీ నాయకుడు  నుమాన్ మహమ్మద్ అన్నారు. ఈ మేరకు సోమవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.

ముఖ్యంగా తెలంగాణ, ,మరాఠా,గుజరాత్,పంజాబ్ రైతులకు నేరుగా ద్రోహం చేస్తుందని విమర్శించా రు. పత్తి ఉత్పత్తికి క్వింటాల్ కి  పదివేలకు పైగా ఖర్చు అవుతుండగా కనీస మద్దతు ధర 7,710 నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రైతులు నేరుగా 2,365 రూపాయలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇ లాంటి నిర్ణయంతో దేశవ్యాప్తంగా 18,850 కోట్ల మేర రైతులు నష్టపోతారని అన్నారు.

ఇలా నష్టపోయిన రైతులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి చివరకు ఏమీ చేసేది లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావించే ప్రమా దం ఉందని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయా న్ని వెనక్కి తీసుకొని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం విదేశీ పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, కనీస మద్దతు ధరను పెంచాలని, బల హీన ప్రాంతాలలో రైతులకు రుణమాఫీ చేసి, రక్షణ ప్యాకేజీలు ఇవ్వాలన్నారు.