09-09-2025 01:09:15 AM
క్యాన్సర్‌కు అత్యాధునాతన చికిత్స
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో సోమవారం రెనోవా హాస్పిటల్స్ వారు కాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ నంద కుమార్ రెడ్డి, వైస్ ఛాన్సలర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వరంగల్, హాల్సియాన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ మెషిన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ పెద్దిరెడ్డి, ఫౌండర్, సీఈఓ, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారితో పాటు డా క్టర్ రాజేష్ బొల్లం, మెడికల్, హెమటో ఆం కాలజిస్ట్, డైరెక్టర్, రెనోవాబన్ను హాస్పిటల్స్ వరంగల్ వారు పాల్గొన్నారు.
శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో మొట్ట మొద టి సమగ్రమైన క్యా న్సర్ హాస్పిటల్‌గా రెనోవా బన్ను హాస్పిట ల్స్ నిలుస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి చికిత్సా సదుపాయాలు వరంగల్ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటితో పాటు అత్యాధునిక లాబొరేటరీ మరియు రేడియాలజీ ఇమేజింగ్ వి భాగాలు కలిగి సమగ్రమైన క్యాన్సర్ చికిత్సను అందించడానికి వీలుగా ఓకే చోట సర్జికల్, మెడికల్ మరియు రేడియేషన్ ఆంకాల జీ విభాగాలు ఉంటాయని తెలిపారు.
రెనో వా హాస్పిటల్స్ గ్రూప్ విస్తరణలో భాగంగా ఈ కేంద్రం భారతదేశంలో రెనోవా గ్రూప్ యొక్క 11వ కేంద్రంగానూ మరియు 7వ ఆంకాలజీ కేంద్రంమన్నారు. సయ్యద్ రిజ్వా న్ మసూద్, డిప్యూటీ మేయర్, జీడబ్ల్యూసీ, వరంగల్, డి విజయలక్ష్మి సురేందర్, కార్పొరేటర్, 11వ డివిజన్, వరంగల్, డాక్టర్ పి. కాళీ ప్రసాద్, ఐఎంఏ, తెలంగాణ మాజీ అధ్యక్షు డు, డా.కె.నాగార్జున రెడ్డి, అధ్యక్షులు, ఐఎంఏ, వరంగల్, డా.ఎం.శేషు మాధవ్, టీజీఎంసీ,
సభ్యులు, డా.నరేష్, టీజీఎంసీ, సభ్యు లు, పలువురు అతిథులతో పాటు డా. రాజేష్ బొ ల్లం, చీఫ్ మెడికల్, హెమటో ఆంకాలజిస్ట్, డైరెక్టర్, రెనోవాబన్ను హాస్పిటల్స్, డా. అలేటి ర వీందర్‌రెడ్డి, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డా.వి నోద్‌కుమార్ దుస్సా, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డా.వై. విష్ణు వర్ధన్‌రెడ్డి, చీఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డా.ఎ.నిఖిల్ కుమార్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్,
డా.కె.శివ కుమార్, హెమటో ఆంకాలజిస్ట్, డా.తరుణ్‌రెడ్డి బాణా ల, సర్జికల్ ఆంకాలజిస్ట్, డా.కిరణ్ బార్లా, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, డా.ఇండీవర్ కిరణ్, మె డికల్ డైరెక్టర్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, జనార్ధన్, రెనోవా గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, రవీంద్రనాథ్ గరగ, సీఓఓ, డా.జి.ప్రి యాంక, సెంటర్ హెడ్, రె నోవా బన్ను హాస్పిటల్స్, వరంగల్ పాల్గొన్నారు.