calender_icon.png 9 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా సైకిళ్లు

06-01-2026 12:00:00 AM

బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎంపీ బండి సంజయ్

బెజ్జంకి, జనవరి 5: కేం ద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బ డుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అని బీజేపీ రాష్ట్ర నా యకులు కరివేద మహిపా ల్ రెడ్డి అన్నారు. సోమవా రం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది విద్యార్థులకు ప్రధాన మంత్రి మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే అధిక సంఖ్యలో చదువుకుంటారని వారికి రవాణా సౌకర్యం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మంత్రి బండి సంజయ్ సైకిల్లు అందజేయాలని నిర్ణయించడం విద్యార్థుల అదృష్టమని చెప్పారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని, అనంతరం 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థుల పరీక్ష ఫీజ్ చెల్లించినట్లు తెలిపారు.

10వ తరగతి తుది పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి మొదటి బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5వేలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సొల్లు అజయ్ వర్మ, సర్పంచ్ లక్ష్మి, ఎంఈఓ మహంతి లక్ష్మి, కోలిపాక రాజు, బొయినిపల్లి అనిల్ రావు, ముస్కే మహేందర్, లింగరావు, దొడ్ల ప్రశాంత్, గండ్ల శ్రీనివాస్, అంజయ్య , సాయిరాం, పాల్గొన్నారు.