calender_icon.png 8 January, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీబొమ్మ తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలి

06-01-2026 12:00:00 AM

  1. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

పార్లమెంట్లో నిలదీస్తాం : ఎంపీ సురేష్ శెట్కార్

సంగారెడ్డి, జనవరి 5(విజయక్రాంతి): నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెద క్ జిల్లా ఆదివాసి కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ శిక్షణా శిబిరం ము గింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ శెట్కార్, టీజీఐ ఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన  కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన  ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అధితుల చేతుల మీదుగా వారికి ప్రశాంస పత్రాలు అందజేశారు.

ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండా గా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ  సిన్సియర్ గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు. ఇలాంటి క్యాంపు సంగారెడ్డిలో జరగడం సంతోషంగా ఉందన్నారు.

నారాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. కరెన్సీపై గాంధీ బొమ్మను తొలిగిం చాలని కుట్ర చేస్తున్నారని,అలాంటి  కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీ సురేష్ శెట్కార్  మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం  నుండి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు.