calender_icon.png 8 October, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిరత్నాలు కంటే రెట్టింపు నవ్వులు

08-10-2025 12:27:56 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ఈ సినిమాతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భానుప్రతాప, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలవు తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఈ సినిమాతో ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు నవ్వులు పంచి, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం” అన్నారు.

నిహారిక మాట్లాడుతూ.. “కథ వినగానే నాకు సరిగ్గా సరిపోతుంది అనుకున్నా. నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది” అని చెప్పారు. చిత్ర సమర్పకుడు బన్నీవాస్ మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ చాలా మంచి కథ. అందరినీ నవ్విస్తుంది” అన్నారు.

‘సినిమాలో సోషల్ సెటైర్ ఉంటుంది. చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది’ అని దర్శకుడు, నిర్మాత ఆదిత్య హాసన్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో మౌళి, దర్శకుడు సాయి మార్తాండ్, సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి, నటుడు జయకృష్ణతోపాటు ‘మిత్రమండలి’ చిత్రబృందం పాల్గొన్నారు.