27-01-2026 01:12:20 AM
ఘట్‌కేసర్, జనవరి 26 (విజయక్రాంతి) : నగరంలోని భారతీయ విద్యా భవన్ వేదికగా సుమన్ మార్షల్ ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 79వ ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని నృత్యంలో అసాధారణ ప్రతిభను చాటిన మోక్షద్రీతి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సో్ల పేరు నమోదు అయింది. ఘట్ కేసర్ సర్కిల్ ఎన్ ఎఫ్ సీ నగర్ కు చెందిన నృత్య కళాకారిణి మోక్షద్రీతి శాస్త్రీయతతో పాటు భావవ్యక్తీకరణలోనూ అద్భుత ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది.
ఈసందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికారడ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, జాతీయ పర్యావరణ ద్రోణాచార్య అవార్డు గ్రహిత, తెలుగు బుక్ ఆఫ్ రికారడ్స్ జ్యూరీ సభ్యులు టీ.వీ. అశోక్ కుమార్ మోక్షదృతికి మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. నృత్యంలో ఆమె చూపిన క్రమశిక్షణ, లయ, భావప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారు ప్రశంసించారు.
మోక్షద్రీతి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో నాట్య గురువు ఝాన్సీరామ్ తో పాటు అకాడమీ ప్రతినిధులు, కళాభిమానులు పాల్గొని నృత్య కళాకారిణిమోక్షద్రీతిని ఘనంగా సన్మానించారు.