27-01-2026 01:15:25 AM
హైదరాబాద్, జనవరి26 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఈనెల 28 నుంచి 31 వరకు జిల్లాల పర్యటన చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరును తొలగించిన అంశంపై కాంగ్రెస్ దేశ వ్యాప్తం గా పోరాటం చేస్తున విషయం తెలిసిందే.
ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలోనూ గ్రామ సభలు పెట్టి ఉపాధిహామీ కూలీలతో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం చొప్పున, రోజుకు రెండు నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న మెదక్, మానకొండూరు, 29న వేములవాడు, ఎల్లారెడ్డి, 30న సమ్మకేొ్కసారల మ్మ దర్శనం, సాయంత్రం ఆలేరు నియోజకవర్గంలో, 31న నకిరేకల్, ఇబ్రాహీపట్నం నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.