calender_icon.png 13 December, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ ఒక్కసారి అవకాశం ఇవ్వండి

11-12-2025 01:44:13 AM

  1. పల్లెల్లో కాకా రేపుతున్న రాజకీయం

గ్రామ అభివృద్ధికై సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న.

పంచాయతీ ఎన్నికలు.. ప్రచారానికి మరో రెండు రోజులే గడువు

హోరా హోరీగా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): అమ్మ ఒకసారి అవకాశం ఇవ్వండి, మన గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అంటూ ఓటర్లను బ్రతిమిలాడుతున్న పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల అభ్యర్థన. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. అయితే వీరి ప్రచారానికి రెండు రోజులు మాత్రమే గడవు ఉంది. ఈ నెల 14,న రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

పగలు ప్రచారం.. రాత్రి విందుబోజనాలు

అభ్యర్థులు ఓ వైపు పగలు ముమ్మర ప్రచారం చేస్తూనే రాత్రి వేళల్లో వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. సమభావన సంఘాల మహిళలు, కాల నీ సంఘాలు, కాలనీ ప్రజలతో భేటీ అవుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గెలిస్తే చేయాల్సిన పనులపై హామీలు ఇస్తున్నారు. కొంత మంది నేతలు స్వయంగా సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇస్తున్నారు.

కుల సం ఘాలతో సమావేశం కావొద్దని ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో రాత్రి వేళల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాయం త్రం అయితే ఓటర్లను మద్యంలో ముంచెత్తుతున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారిని తమ అనుచరుల ఇళ్లకు రప్పించి దావత్లు ఇస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఓటర్లకు హోటళ్లలో సిట్టింగ్లు, వారి నివాసపు ప్రదేశాలలో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.

వర్గాలవారీగా కుల సంఘాల వారిగా ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు 

పల్లెల్లో గ్రామాలలో కుల సంఘాలకు వర్గాల వారీగా రాత్రిపూట ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున,అభ్యర్థుల గెలుపుకై, సర్పంచ్ అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఓటర్లను మభ్య పెట్టడానికి పలు గ్రామాలలో కూడా రాత్రిపూట ప్రజలకు కావలసిన తిను బండారాలను చికెన్ మటన్లతో విందు భోజనాలు పెడుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా రెండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో అభ్యర్థులు తమ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఓటర్లను తమవైపు మలుపుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.