11-12-2025 01:45:34 AM
నిజామాబాద్ డిసెంబర్ 10 (విజయ క్రాంతి) నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాలలో పోలింగ్ బూతులను నిజామాబాద్ పోలీస్ శాఖ కమిషనర్ చైతన్య పర్యవేక్షించరు. పంచాయతీ మొదటి విడత ఎన్నికలు నిర్వహించే బోధన్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూతులను నేడు బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రధానంగా బోధన్ మండలంలోని సాలూరా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సాలురా మండలంలోని జాడి జమాల్పూర్, సాలూరా క్యాంప్, సాలూరా పోలింగ్ కేంద్రాలను కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారూ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూతులసంబంధి త అధికారులతో మాట్లాడుతూ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రత ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ప్రలోభాలు లేదా బెదిరింపులకు తావు లేకుండా కట్టుదిట్టమైన పహారా నిర్వహించాలనీ తెలిపారు.
అధిక ప్రాధాన్యత గల, సున్నిత పోలింగ్ స్టేషన్లలో అదనపు సిబ్బంది ని నియమించిన నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహారించాలి అని సూచిం చారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో 163 BNSS అమలులో ఉన్నందున, నలుగురికి మించి వ్యక్తులు ఉండకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసు కోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండకూడదని ఆదేశించారు.
ప్రజలు ధైర్యంగా, భయ భ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సిబ్బంది మర్యాదపూర్వకంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించరు. ప్రజలు నిరభ్యంతరంగా ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా బోధన్ ఎ. సి. పి శ్రీనివాస్ , బోధన్ ఎస్. హెచ్. వెంకట్ నారాయణ, రూరల్ ఎస్. ఐ శ్రీ మచ్చేందేర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.