11-12-2025 01:42:41 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10 (విజయ క్రాంతి):రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేట్ గ్రామంలో హైదరాబాద్, బోధన్ ప్రధాన రహదారిపై ఎక్సైజ్ పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. కార్లు ఇతరంతా వాహనాలను కలిపి పరిశీలించి తనిఖీ చేశారు.ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు వాహనాదారులు జాగ్రత్త పాటించాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ.షాకిర్ హైమద్ తెలిపారు. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన రసీదులు వెంట ఉంచుకోవాలన్నారు.
లేకుంటే నగదు సీజ్ చేస్తామని హెచ్చరించారు.మద్యం అక్రమ రవాణాపై ప్రతిష్ట నిఘ ఉందని వెల్లడించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్లు సమాచారం ఇచ్చినట్లయితే తక్షణమే ఆప్రాంతానికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మహమ్మద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.