calender_icon.png 16 August, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువకన్నా ప్రయోజనం మిన్న

23-07-2025 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

చాలా సారవంతమైన గని.. తక్కువ సారం గలిగిన గనుల్లో ఏ గనిని ఆదరించాలనే సందేహం కలిగిన సమయంలో.. చిన్నదైనా సారవంతమైన గని మంచిది. ఎందుకంటే విలువ గలిగిన, ధాతువులున్న గని తక్కువ సారవంతమైన పెద్ద గనిని కూడా ఆర్థికంగా అధిగమిస్తుంది.. అనేది కొందరి వాదన. దానికి భిన్నంగా..

చిరాదల్పో మహాసారస్య క్రేతా విద్యతే

ప్రభూతః సాతత్యా దల్పసారస్య!

(కౌటిలీయం  712)

చాలా ఖరీదైన వస్తువును కొనేవారి కన్నా, తక్కువ ఖరీదైన వస్తువును కొనేవారు ఎక్కువగా ఉంటారు. కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉన్న వస్తువులను ఉత్పత్తి చేస్తే.. అమ్మకాలు నిరంతరాయం గా జరిగి లాభాలు నిరవధికంగా వస్తాయ ని ఆచార్య చాణక్యుడి అభిప్రాయం. వజ్రా లు, మణులు, పగడాలు, బంగారం, వెండిలాంటి ధాతువులున్న గనుల కన్నా, బొగ్గు ను వెలికితీసే గనుల వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది.

వ్యాపారంలో లాభార్జన అవసరమే అయినా, వస్తువు విలువ కన్నా ప్రయోజనం మిన్న. ప్రమాదాలు పొంచి ఉండే భూగర్భ గనుల్లో పనిచేయడం అపాయకరమైన, సాహసమైన కార్యంగానే భావించాలి. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తూ.. ప్రమాదాలకు ఆస్కారమైన స్థలాలను ముందుగా గుర్తించాలి, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మెరుగైన ఉత్పత్తి సాధించా లి.

దార్శనికుడైన అధికారి ప్రమాదాలను ముందుగా అంచనావేయ గలుగుతాడు. అయితే, పాత అలవాట్లు, పాత పద్ధతుల్లో పనిచేసేందుకు అలవాటు పడినవారికి, పాత ఫలితాలే పునరావృతమవుతాయి. చాలామందిలో కాలం చెల్లిన నమ్మకాలు బలంగా ఉంటాయి. పాత పద్ధతులు, ఆచరణలు ప్రస్తుత అవసరాలకు, భవిష్యత్ అవసరాలకు సరిపోతాయి. ప్రస్తుతం ఉన్న పోకడలు ఇకముందూ కొనసాగుతాయి.

భవిష్యత్తు భయంకరమైనది.. దానిని అంచనా వేయలేం.. ఈ మూడూ నిజానికి అపోహలే. అవసరానికి అనుగుణంగా మారడం, కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అవసరమైన నైపుణ్యాలను సంతరించుకోవడం, వాటిని ఆధునీకరించుకోవడం వల్ల మాత్రమే అభ్యుదయాన్ని సాధించగలుగుతాం. ముఖ్యంగా ప్రమాదభరితమైన గనుల్లో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలను ఆహ్వానించినట్లే.

నిర్వాహకుడికి నిబద్ధత ఉండాలి..

ఈనాటి ‘మార్కెట్’ అవకాశాలను అధికంగా ఇస్తున్నది. సృజనాత్మకత బంగారు గనిలాంటిది. ఎంతగా తవ్వుకుంటే అంత గా ఫలిస్తుంది. సమర్థత కలిగిన సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు/సేవలను సమయానికి, సరసమైన ధరకు అందిస్తే కొను గోలుదారు ఆదరిస్తాడు. అధిక లాభాపేక్షతో, అత్యాశతో, మోసాలకు పాల్పడే వ్యాపారులు మాత్రం కాలాంతరంలో మార్కెట్ నుంచి అస్తమించకతప్పదు.

నిర్వాహకుడు ఒక సంస్థను విజయవంతం గా నడపవచ్చు, అదే నిర్వాహకుడు మరొక సంస్థలో అపజయం పాలూ కావొచ్చు. ఆకలి బాధను, జీవిత గమనంలో నొప్పి తెలిసినవాడు ఎంతైనా శ్రమిస్తాడు. వజ్రాలు, మణుల లాంటివి అతిశయానికి, దర్పానికి ప్రతీకలుగా నిలువొచ్చు కాని, గని నుంచి వెలికితీసిన బొగ్గు విద్యుత్తుగా.. పరిశ్రమల్లో ఇంధనంగా మారి ఎందరికో ఉపాధినిస్తుంది.

ఎన్ని గృహాల్లోనో వెలుగులు నింపుతుంది. నిర్వాహకునికి సంస్థ ను ఉన్నతీకరించడంలో పట్టుదల, నిబద్ధ త, శ్రద్ధ, ఆసక్తి ఉండాలి. తోటి ఉద్యోగులతో లేదా యాజమాన్యంతో లేదా కొను గోలుదారుతో అబద్ధాలాడడం, తప్పుడు వాగ్దానాలు చేయడం ప్రమాదకరం.

సామర్థ్యాన్ని సంస్కారాన్ని ప్రదర్శిస్తూ.. ఉద్యో గుల మధ్య ఉద్యోగిగా మసులుకునే నిర్వాహకులు గనుల నిర్వహణలో ఉత్తమ ఫలి తాలను ఆస్వాదిస్తారు. సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, సమన్వయంతో ఉద్యోగులందరినీ కలుపుకొనిపోయే నిర్వాహకునికి యాజమాన్యం ఉన్నత బాధ్యతలను అప్పగిస్తుంది. 

అంకితభావం.. సత్ఫలితాలు..

సింగరేణిలో 2.2 నుంచి 2.5 మీటర్లు ఏటవాలుగా ఉండే లోతైన ఒక గని ప్రమాదంలో బొగ్గుపెళ్ల కింద ఒక కార్మికుడు పడిపోయాడు.. ‘నవ్వుతూ పలకరించడం’ అనే అలవాటు గలిగిన ‘సూర్యనారాయ ణ’ అనే అధికారి.. ఆ కార్మికుని రక్షించేందుకు మరొక కార్మికుని పురమాయించగా, అతడు కొన్నిగంటల పాటు శ్రమించి తోటి కార్మికున్ని రక్షించి గనిపైకి తీసుకువచ్చాడు. వారు బయటకు రాగానే పైకప్పు అమాం తం కూలింది. 

మరొక సంఘటనలో ఒక కార్మికుడు పూర్తి చీకటిగా ఉండే గనిలో దారితప్పి వెలుపలికి రాలేని స్థితిలో ఆశలు వదలేసుకునే స్థితిలో ఉండగా, తోటివారు దాదాపు 16 గంటల పాటు శ్రమపడి, సమయం అతనికై వెతికి ఆశలను వదిలేసుకున్న తరుణంలో, అదే అధికారి మరొక వ్యక్తి తోడు తీసుకొని కేవలం తలపై ఉండే లైట్ సాయంతో అతనిని వెతికి గుర్తించి తీసుకుచ్చాడు. దీనిని ఆ అధికారి నిబద్ధతకు, తోటి కార్మికుని ప్రాణాలకు అతనిచ్చే విలువలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఆ అధికారి వల్ల గనిలో యాజమాన్యం, ఉద్యోగుల బంధం దృఢంగా నిలిచింది. ఫలితంగా గని పరిధిలో సమ్మెలు, బంద్ లు నిలిచిపోయాయి. ఉత్పత్తి, ఉత్పాదకతలు గతానికన్నా చాలా ఎక్కువగా నమో దయ్యాయి. తనకు అవసరమైన పనిని చేయించుకునే క్రమంలో, ప్రతి విభాగంలో కిందిస్థాయి ఉద్యోగి వద్దకు వెళ్లి సమాచారాన్ని సేకరించే ఆ అధికారి కార్యదీక్ష ప్రశం సారమైంది.

అదే అధికారి తాను సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకుని, తాను పనిచేస్తున్న గనుల్లో సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడం, శ్రద్ధతో, తపన తో స్వయంగా తాను కంప్యూటర్ వంటివి నేర్చుకోవడం, ఉద్యోగులకు శిక్షణ నివ్వడం వల్ల.. అటు గనిలోనూ, ఇటు కార్యాలయంలోనూ అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలి గాడు. ఉద్యోగుల రక్షణ, భద్రత ప్రాధాన్య అంశాలుగా, అంకితభావనతో పనిచేసే అధికారుల మార్గదర్శనంలో ఉద్యోగులూ కష్టాన్ని ప్రేమిస్తారు. ఉత్పత్తిని, ఉత్పాదకతను సైతం పెంచుతారు.

విశ్వసనీయత, బలమైన బంధాలు..

వ్యక్తిలోని నిబద్ధత, నిజాయతీ ఉద్యోగుల- వినియోగదారుల బంధాలు గట్టిగా నిలిచేందుకు ఉపయుక్తమవుతాయి. ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన మొబైల్‌ను స్లీపర్ కోచ్‌లో మరచిపోయింది. ఆ కోచ్‌లో పనిచేసే అటెండెంట్ ఆ మొబైల్ తీసుకున్నాడు.

మొబైల్‌లోని కాంటాక్ట్స్ ఆధారంగా మహిళను ఫోన్‌లో సంప్రదించి, మొబైల్ తన వద్దే ఉందని.. మూడు రోజుల తర్వాత తాను తిరిగి అదే రైలులో వెనుక్కు వస్తానని చెప్పాడు. అలా రైలు సదరు స్టేషన్‌కు రాగానే అటెండెంట్ మొబైల్‌ను మహిళకు అప్పగించాడు. మొబైల్‌ను తిరిగి ఇవ్వడం ఆ ఉద్యోగి నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తుంది. సంస్థ విశ్వసనీయతను పెంచుతుంది. 

అలాగే.. ఒక బీరువాను ఓ వ్యక్తి ఇచ్చిన వేళ ఆ బీరువాలో పొరపాటున పెట్టి మరచిన బంగారు గొలుసును, వెండి కంచాన్ని ఆ కార్మికుడు భద్రంగా తిరిగి యజమాని కి ఇవ్వడం అతని నిజాయితీని తెలపడమే కాక, వినియోగదారునితో బంధాన్నీ గట్టిపరుస్తుంది.