calender_icon.png 5 October, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

05-10-2025 12:16:50 AM

-తండ్రి, మరో కుమార్తెకు తీవ్ర గాయాలు lట్రాక్టర్‌ను డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం

-రాజీవ్హ్రదారిపై సీతాఫలాలు కొనుగోలు చేస్తున్న కుటుంబసభ్యులు

-కరీంనగర్ జిల్లా దేవక్కపల్లి వద్ద ఘటన

-బెజ్జంకి, అక్టోబర్ 4(విజయక్రాంతి): రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రీ, మరో కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ  సంఘటన మండలంలోని దేవక్కపల్లి గ్రామ శివారు రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన రామోజు శ్రీమన్ తన అత్తవారి గ్రామం కొహెడ మండలం వింజపల్లి.

దసర పండుగకు వచ్చిన భార్య వీణా, కూతుర్లు మనస్విని, యసస్వినిని తిరిగి తన స్వగ్రామానికి తీసుకువెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.దేవక్కపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారి ప్రక్కన సీతాఫలాలు కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనం నిలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వరికోత యం త్రం విడిభాగంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది.వరికోత యంత్రం విడిభాగం సీతాఫలాలు కొనుగోలు చేస్తున్న వారిపై ఎగిరి పడడంతో వీణా, మనస్విని అక్కడికక్కడే మృతి చెందారు.శ్రీమన్, యసస్వినికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు రేణికుంట టోల్ గేట్ అంబులెన్స్ యందు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సౌజన్య తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాఫ్తు చేపట్టారు.