05-10-2025 12:18:44 AM
బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల రామారావు
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): దేశంలోని దాదాపు 30 లక్షల మంది న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు బీమా (ఇన్సూరెన్స్) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల రామారావు తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, దాడులు, ఇతర భద్రతా సమస్యల పరిష్కారంగా ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం తీసు కురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. లా కమిషన్ రిపోర్ట్ అందగానే కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఆరోగ్య భద్రత, బీమా, డెత్ బెనిఫిట్‌లతో కూడిన ఇన్సూరెన్స్ స్కీంను రూపొందించి అమలు చేయనుందని తెలిపారు.
ప్రస్తుతం 50 వేల మంది న్యాయవాదుల్లో కేవలం సగం మందికి మాత్రమే స్టేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ అందుతోందని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం మరో రూ. 100 కోట్లు విడుదల చేసి న్యాయవాదులకు సమానంగా ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు.