calender_icon.png 4 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

03-11-2025 07:30:33 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఆడేపు భాస్కర్  దివ్యాంగుల అభ్యర్థనలకు వెంటనే స్పందించి సానుకూల చర్యలు చేపట్టారు. 90% వైకల్యం ఉన్న షేక్ తాజ్, దెబ్బటి గణేష్ లు ట్రైసైకిల్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే అధికారి ఆదేశాల మేరకు ఎఫ్ఆర్ఓ రవి  ఇద్దరికీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఇస్లాం బిన్ హసన్ పాల్గొన్నారు.