03-11-2025 07:41:57 PM
బీర్కూరు భాజపా నాయకుల డిమాండ్..
సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు..
బాన్సువాడ (విజయక్రాంతి): గత మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్ పైన భారత సైన్యంను అవమానించే విధంగా ఒక వర్గానికి మద్దతుగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బేశరత్తుగా దేశ సైన్యానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ బీర్కూరు మండల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి భాజపా నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను లాగేశారు.
ఈ కబిజెపి బీర్కూరు మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్ మాట్లాడుతూ భారతదేశం సశశ్యామలంగా ఉగ్రవాదుల దాడులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంలో భాజపా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉండడం అని తెలిపారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేని ఎడల భాజపా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు మల్లెల యోగేశ్వర్ బొంతల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు చేపూరి హనుమాన్లు ,నూకల రాము ,వడ్ల బసవరాజ్ యువమోర్చా అధ్యక్షులు కొట్టే వినీష్ బిజెపి సీనియర్ నాయకులు బీరుగొండ ,పండరి, బిజెపి కార్యకర్తలు, ప్రవీణ్, చైనాపురం బసవరాజ్, అవారి శంకర్, పాల్గొన్నారు.