calender_icon.png 4 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ విజయవంతం చేయాలి

03-11-2025 07:38:37 PM

జిల్లా అధ్యక్షుడు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్..

వనపర్తి టౌన్: వనపర్తి జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమావేశము ఈరోజు వనపర్తి పాలిటెక్నికల్ కాలేజీ ఆవరణలో జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నవంబర్ 9 వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి గారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండం సార్ హాజరవుతున్నారు. ఇందులో ముఖ్యమైన డిమాండు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మరియు సమాన పనికి సమాన వేతనము అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయడం ఉద్యోగ భద్రత కల్పించడం తదితర డిమాండ్లపై ఈ సభను నిర్వహిస్తున్నాము కనుక వనపర్తి జిల్లాలోని ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతను,బలాన్ని కనపర్చాలని  చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ, రఘు, తదితరులు పాల్గొన్నారు.