calender_icon.png 4 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

03-11-2025 07:30:56 PM

నేరేడుచర్ల (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ మేరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షమును ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును 9వ షెడ్యూలో చేర్చాలని, రాబోయే శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. 42 శాతంలో వర్గీకరణ చేసి అత్యంత వెనుకబడిన వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని 9,200 కోట్లు కేటాయించి కేవలం 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

రాబోయే బడ్జెట్లో 40 వేల కోట్లు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులలో బీసీ ఎస్సీ ఎస్టీ వారికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు, కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కుల సంఘం నాయకులు బొడ్డుపల్లి సుందరయ్య ధనుంజయ నాయుడు ముషం నరసింహ యామిని వీరయ్య గుర్రంమార్కండేయచిలక రాజు శ్రీను రాపోలు నవీన్ అవిరెండ్ల నాగేంద్రబాబు ఇంజమూరి వెంకటయ్య పిల్లలమర్రి పుల్లారావుకాపర్తి శ్రీనివాస్ గోపిశెట్టి సతీష్ కొమర్రాజు లక్ష్మయ్య బత్తిని  శ్రీనివాస్ కొప్పు రామక్రిష్ణ మిడిశెనమెట్ల సతీష్ శ్రీకాంత్ చంద్రమౌళి భోగి శెట్టివెంకన్న పాల్గొనడం జరిగింది.