calender_icon.png 4 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలి

03-11-2025 07:41:37 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం ముందు నిరసన

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్

నకిరేకల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న  ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల  చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజురీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ గత ఆరేళ్ల గా ప్రభుత్వం చెల్లించడం లేదనిఆయన  విమర్శించారు.

2023-24 విద్యాసంవత్సరంగాను 2000 కోట్లు, 2024-25 విద్యాసంవత్సరం 2100 కోట్లు, 202526 విద్యాసంవత్సరంగాను  2200 కోట్లు మొత్తం 6,300 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ విద్యార్థులకు ఇవ్వాలసిన ఫీజులు, గత ప్రభుత్వం హయంలో 4100 కోట్లు బకాయిలు ఉన్నాయ. మొత్తం 10,400 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. 

దసరా కంటే ముందు ప్రభుత్వం యాజమాన్యాలు సమ్మె సందర్భంగా చర్చలు జరిపి దసరాకు -300 కోట్లు, దీపావళి -900 కోట్లు నవంబర్ నెలలో -300 మొత్తం 1200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. వాటిలో 300కోట్లు  మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. మిగతా బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వంతో చర్చించి ఫీజులను విడుదల చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు.