calender_icon.png 4 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారంలో వ్యక్తి దారుణ హత్య

03-11-2025 07:19:12 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పారిశ్రామిక వాడలో ఓ వ్యక్తి  హత్య గురైన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబెల్లి తెలిపిన వివరాల  ప్రకారం నాచారం పారిశ్రామిక వాడలో  తెలంగాణ ఫుడ్ పరిశ్రమ సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో దాడి  చేసి పారిపోయారు. రక్తపు మడుపులో తీవ్ర గాయాలైన వ్యక్తిని చూసిన స్థానికులు నాచారం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని  హత్యకు గురైన వ్యక్తి మురళీకృష్ణ  గుర్తించారు. మురళి కృష్ణ వృత్తి రీత్యా  సెంట్రింగ్ వర్కర్ అని  అతని భార్య ఉప్పల్ కళ్యాణపుర్లోని ఒక ఇంట్లో కేర్ టేకర్ గా  పనిచేస్తూ జీవన సాగిస్తుంది అని తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియల్సి ఉంది అని  పోలీసులు తెలిపారు మృతిదేహంని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నాచారం సబ్ ఇన్స్పెక్టర్  మైబెల్లి తెలిపారు.