03-11-2025 07:27:05 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల సహాయార్థం టీఎన్జీవో, టీజీవో, ట్రేస్స, జిల్లా అధికారుల వెల్ఫేర్ సంఘం, పంచాయతీ రాజ్, భగీరథ మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటిఐ తదితర సంఘాల సహకారంతో 500 నిత్యవసర సరుకుల కిట్స్, బెడ్ షీట్స్ పంపిణీ చేయుట కొరకు ఏర్పాటుచేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి కావలసిన నిత్యవసర సరుకులు, బెడ్ షీట్స్ అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ కలెక్టర్ టీఎన్జీవో, టీజీవో నేతలను పిలిచి మన వంతుగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు సహాయం అందించాలని కోరడంతో వెంటనే ఉద్యోగులు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్, టీజీవో అధ్యక్షులు ఆకవరం శ్రీనివాస కుమార్, సహకార శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమనేని జగన్మోహన్రావు, డిఆర్డిఓ పిడి మేన శ్రీనివాస్, ట్రేస్సా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాజీపేట ఎమ్మార్వో బావూసింగ్, ఆసనాల శ్రీనివాస్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేష్, పోలురాజు, దాస్య నాయక్, రాజ్యలక్ష్మి , ఎంపిడిఓ ల సంఘం కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ ల సంఘం రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.