03-11-2025 07:36:42 PM
నకిరేకల్ (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యం కారణంతో గుంతలో పడి బాలుడి మృతి చెందిన సంఘటన కేతేపల్లి మండలం కాసనకోడు గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాసనగోడు గ్రామంలోని అంగన్ వాడి మొదటి కేంద్రంలో అదే గ్రామానికి చెందిన కుంచం జగదీష్ కుమారుడు అయాన్(4) చదువుతున్నాడు. బాత్రూం రావడంతో బయటకు వెళ్లి మల విసర్జన చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. గతంలో జెసిబితో గుంతను తీశారు. ఆ గుంతలో బాలుడు వాష్ చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. పలు అనుమానాలకు తావు.. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలను కంటికి రెప్పలా కావాల్సిన టీచర్, ఆయా నిర్లక్ష్యా కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంగడి కేంద్రాల్లో పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న.పిల్లలను మలవిసర్జన ,బాత్రూం కోసం బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేలా తీసుకువెళ్లిన పిల్లల వెంట ఆయా ఎందుకు వెళ్లలేదు. పిల్లలకు వాష్ చేయాల్సింది ఆయే కదా ఆమె ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంతా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా అంగన్ టీచర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకొని బాలుడు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో ఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనను వివరాలను అడిగి తెలుసుకున్నారు.