calender_icon.png 4 November, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారిపై రైతుల నిరసన

03-11-2025 07:22:21 PM

ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రహదారిపై వరి ధాన్యంలోడు లారీ నిలిపివేసి రైతులు నిరసనకు దిగారు. రైతులకు బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. రైస్ మిల్లుకు తరలించిన ధాన్యాన్ని ఐదు రోజులైనా రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతుగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు రోడ్డుపై బైఠాయించి  రాస్తారోకో చేపట్టారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైస్ మిల్లర్లు కటింగ్ పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని వారుడిమాండ్ చేశారు.రైతుల ఫిర్యాదుతో గొల్లపల్లిలోని ఓ రైస్ మిల్కు ధాన్యం పంపించవద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు డిఎస్ఓ ఆదేశించి రైస్ మిల్ కు నోటీసులు జారీ చేసినట్లు బిజెపి నాయకులు తెలిపారు.