calender_icon.png 29 October, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో

29-10-2025 07:39:04 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ పరిశీలించారు. బుధవారం మండలంలోని సారంగపల్లి, చిరకుంట గ్రామాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అధికారుల సూచన మేరకు నిర్మాణాలు చేపట్టాలని, ఇంటి నిర్మాణంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య  చర్యలను  పరిశీలించిన ఆయన మురుగు కాలువలల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధాన్ని మెరుగు పరచాలని సూచించారు. పారిశుద్ధ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.