29-10-2025 07:37:33 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో బుధవారం నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను పంపడం, స్వీకరించడం, డబ్బు బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు, బిల్లు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ లు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో అభినవ్ చందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శామప్ప పటేల్, మొగుల గౌడ్, అహ్మద్, శ్రీహరి, రామారావు, నారాయణరావు, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.