calender_icon.png 15 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక అసమానతలు ప్రమాదకరం

15-07-2025 12:44:16 AM

బహుజనగణమన పుస్తక ఆవిష్కరణలో బండారు దత్తాత్రేయ

ఖైరతాబాద్, జూలై 14 (విజయ క్రాంతి): సామాజిక అసమానతలు ఎంతో ప్రమాదకరమని హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ అన్నారు. సమాజం సమతుల్యంగా ఉండాలంటే అందరికీ సమాన హక్కులు ఉండాలన్న దార్శనిక ఆలోచనలతో “బహుజనగణమన” దీర్ఘకావ్యం వెలువడిందని ఆయ న తెలిపారు . మహాకవి గురజాడ దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్ అన్నారని “బహుజనగణమన”కావ్యం దేశమంటే బహుజ నులదని చాటుతుందని పోల్చిచెప్పారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జూలూరు గౌరీశంకర్ రచించిన “బహుజనగణమన” దీర్ఘకావ్యా పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అత్యవసరమైనదని అది అమ లు జరిగేటట్లు చూడాలని చెప్పారు. సామాజిక సమస్యలకు పరిష్కారం దొరకకపోతే దేశమే అల్లకల్లోలమవుతుందన్నారు.

ఆర్థిక అసమానతల కంటే సామాజిక అసమానతలు అత్యంత ప్రమాదకరమన్నారు. ఓబీసీ పార్లమెంట్ కమిటీ చెర్మన్‌గా నన్ను ఎంపికచేస్తే తనకు మంత్రి పదవి కంటే ఇదే గొప్పదని ప్రధాని మోడీకి చెప్పానని గుర్తుచేసుకున్నా రు. ఎస్‌సీ, ఎస్‌టీ పార్లమెంటు కమిటీకి ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన అధికారాలను బీసీలకు కూడా ఇవ్వాలని కోరుతూ తానిచ్చిన నివేదిక సూచనలను మోడీ 3 రోజుల్లో అంగీకరించారని తెలిపారు.

బీసీలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే అది బీసీ రాజ్యాధికారానికి దారి అవుతుందని చెప్పారు. బీసీలు ఐకమత్యంగా నిలవటమే  తక్షణ అవసరమని అన్నారు. ఎవరిదారిన వారు పోతే ఐక్యత చీలిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాల బీసీల ఆకాంక్షలను నెరవేస్తూ బీసీ జనగణనను ప్ర ధాని మోడీ చేపట్టారని, దీనివల్ల బీసీల రాజ్యాధికారానికి దారుల ఏర్పడతాయన్నారు. బీసీ లలో భావజాల వ్యాప్తికోసం “బహుజనగణమన” కావ్యాన్ని పల్లెపల్లెకు, నవతరానికి అం దించాలని దత్తాత్రేయ తెలియజేశారు.

ఈ పు స్తకావిష్కరణ సభకు మీడియా అకాడమి మా జీ చెర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించగా రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రముఖ రచయిత్రి జ్వలిత, చరిత్రకారుడు, రిటైర్డ్ ఢిల్లీ  యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమ లి, ప్రముఖ సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కార్యదర్శి రవికాంత్‌రెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు.. “బహుజనగణమన” పుస్తకం బీసీలకు భావజాల ఆయుధమని  పేర్కొన్నారు. తరాలుగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు రాజ్యాధికారమే అంతిమ పరిష్కారమని ఈ కావ్యం చాటుతుందని తెలిపారు.