09-10-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, అక్టోబర్ 8 : నాగల్ గిద్ద మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నామినేషన్ ప్రక్రియ విధానాన్ని, సామాగ్రిలను ఏర్పాటు పరిశీలించడం జరిగింది. నామినేషన్ పత్రాలు పూర్తిస్థాయిలో నింపిన వాటిని స్వీకరించాలని తెలిపారు. వారితోపాటు ఎంపీడీవో మహేశ్వరరావు, తహసిల్దార్ శివకృష్ణ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.