calender_icon.png 8 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ పోరాటం అందరి సంక్షేమం కోసం

08-07-2025 12:13:39 AM

గండీడ్ జులై 7 : ఎమ్మార్పీఎస్ పోరాటం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమేనని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కామి వెంకట్ రాములు అన్నారు. సోమవారం మండ ల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంద కృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో1994 లో మొట్టమొదటిసారిగా దండోరా జండా ఆవిష్కరించి ఎస్సీలకు ఏ బి సి డి వర్గీకరణ జరగాలని ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు.

పేద ప్రజల వైద్యం కోసం ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని, వికలాంగులకు పెన్షన్ పెంచడం వంటి వాటిలో అమలు చేయించి ప్రత్యేక ముద్ర వేయడం జరిగిందన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ అమలు కావడం ప్రపంచమంతా హర్షించదగ్గ విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు ఎం. ఆశన్న, మండల మాజీ ఎంపీపీ కొమీరే లక్ష్మయ్య, మాజీ జెడ్పిటిసి జంగల్ల వెంకటయ్య. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుముడాల చెన్నయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య గండేడ్ మండల టిఎమ్‌ఆర్పిఎస్ అధ్యక్షులు కొండాపూర్ దస్తయ్య, రంగారెడ్డి పల్లి మాజీ ఎంపిటిసి కుందేటి కిష్టయ్య వెన్నచెడు మాజీ ఎంపిటిసి ఆశన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.