08-07-2025 12:15:15 AM
ఈ నెల 10 వ తేదిన స్టేట్మెంట్ రికార్డు కోసం ఎమ్మెల్యే కు ఆహ్వానం
మహబూబ్ నగర్ జూలై 7 (విజయ క్రాంతి) : పోలీసులు ఫోన్ ట్యాపింగ్ విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నయెన్నం శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్ 6300446873 అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైందని , ఎస్‌ఐబి యొక్క సి డి ఆర్ జాబితాలో చోటు ఉందని అందుకు సంబంధించి,
ఈ నెల 10 వ తేదిన ఉదయం 11 గంటలకు అసిస్టెంట్ పోలీస్ కమీషనర్, జూబ్లీహిల్స్ డివిజన్ , హైదరాబాద్ ముందు హాజరై ఫోన్ ట్యాపింగ్ పైన ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వాలని అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ , జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఎమ్మెల్యేకి పిలుపు వచ్చింది.