14-09-2025 01:05:04 AM
అందుకు నూతన పాలసీని రూపిందించాం
శంషాబాద్‌లో గో నేషనల్ ఎక్స్‌పో సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాటా 10 శాతం ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభు త్వం ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని రూ పొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం శంషాబాద్‌లో గో-నేషనల్- ఎక్స్‌పో-2025 ఐదో ద్వైవార్షిక సదస్సును మంత్రి ప్రాంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు మం త్రి సమాధానాలు తెలిపారు.
దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బిఎన్ ఐ) నిర్వహిస్తోంది. రెండు రోజుల పా టు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు కొనసాగుతాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్ ఎంఇలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా తమ ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి వివరించారు.
తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో కృత్రిమ మేథ నూతన ఆవిష్కరణల హబ్ ను ప్రారంభిస్తామన్నారు. చిన్న పరిశ్రమల ఉత్పాదనల ఎగుమతులకు రాష్ట్రంలో రెండు డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదబాద్ పశ్చిమాన ముం బాయి వైపు ఒకటి, తూర్పున కాకినాడ వైపు మరొకటి నెలకొల్పుతామని వెల్లడించారు. సదస్సులో ఉత్పత్తుల ప్రదర్శన, వివిధ అంశాలపై సమావేశాలతో పాటు బేకింగ్, ఫుడ్ ఇన్నోవేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ స్టయిలింగ్ ఫోటోగ్రఫీ, వాణిజ్య ప్రకటనలపై పోటీలు జరిగాయి.