18-08-2025 01:53:46 AM
ముదిరాజ్ మెపా వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్
ములుగు,ఆగస్టు17(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలోని మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్,ఉపాధ్యక్షుడు పొన్నం రాజు ముదిరాజ్ విచ్చేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్ యువత అత్యధికంగా స్థానాల్లో పోటీ చేసి జాతి గౌరవాన్ని, మన సత్తాను చూపించాలని తెలియజేస్తూ,సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషనులో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్స్ ను, ముదిరాజ్ లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ముదిరాజ్ సమాజం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.