calender_icon.png 28 June, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

800 మందికి ముజీబ్ అన్నదానం

13-06-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో  గురువారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణ లో సుమారు 800 మంది రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీఎన్జీవోస్ కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ గౌడ్, క్రీడా కార్యదర్శి బోలిగిద్ద శంకర్, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముకీమ్ ఖురేషి, టీఎన్జీవో క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బి. శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్‌ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్, మిత్రులు నికామ్ నివాస్, మరాఠా  సంఘం ఉపదక్షుడు, ఉస్మాన్ అలీ ఉస్మాని, శ్రీరామకృష్ణరెడ్డి పాల్గొన్నారు. కీర్తిశేషులైన తల్లిదండ్రుల పేరు మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని ముజీబ్ అన్నారు.