calender_icon.png 8 July, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పరిశోధనకు ములకలపల్లి ఉపాధ్యాయుడు

03-07-2025 12:00:00 AM

ములకలపల్లి జులై 2 (విజయక్రాంతి); మారుమూల గ్రామం నుంచి జాతీయ శిక్షణ కా ర్యక్రమానికి ములకలపల్లి ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శంకర్ జాతీయస్థాయి విద్యా పరిశోధనా కు ఎంపికయ్యారు.

రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ లోని జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ కేంద్రంలో ఈనెల 16 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించే శిక్షణకు హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన ఆచరణాత్మక బోధన అనే అంశంపై ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దీంతో జాతీయ శిక్షణకు ఎంపికయ్యారు. ఎంపికైన ప్రధానోపాధ్యాయుల్ని మండల విద్యాశాఖ అధికారి జి.సత్యనారాయణ, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.