calender_icon.png 5 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీఎం షెడ్‌ను తలపిస్తున్న ములుగు సెక్షన్ కార్యాలయం

05-05-2025 01:41:26 AM

  1. రైతులకు ఇవ్వడానికి లేని ట్రాన్స్ ఫార్మర్లు, ఆఫీసులో నిలువ

భేరసారాల కోసమే అంటున్న స్థానికులు 

రోడ్డుపైకి కనిపిస్తున్న ట్రాన్స్ ఫార్మర్లు 

అయినా పట్టించుకోని విద్యుత్ శాఖ జిల్లా అధికారులు 

సిద్దిపేట, మే 4(విజయ క్రాంతి): డీడీలు కట్టి నెలల కొద్ది ఆఫీసుల చుట్టు రైతులు తిరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోని అధికారులు తమకు కావాల్సిన వారికోసం సెక్షన్ ఆఫీసుల్లో నెలల కొద్ది ట్రాన్స్ ఫార్మర్లు నిలువ చేసుకుంటున్నారు. ఎస్ బిఎం (స్పాట్ బిల్లింగ్ మానిటరింగ్) మాదిరిగా ములుగు సెక్షన్ కార్యాలయం దర్శనమిస్తుంది.నిజానికి ఒకటి, అర తప్ప అది కూడా కొత్త ట్రాన్స్ ఫార్మర్లు మినహా సెక్షన్ కార్యాలయాల్లో ట్రాన్స్ ఫార్మర్లు నిలువ చేయడానికి వీలు లేదు. కానీ సిద్దిపేట జిల్లాలో ములుగు మండలం హైదరాబాద్ మహ నగరానికి అతి చేరువలో ఉండడంతో భారీగా ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి.

ఈ పరిశ్రమల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి లోకల్ అధికారులు అమ్యామ్యాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కార్యాలయంలో ఏడీఈ కార్యాలయం ఉండడం, రా జీవ్ రహాదారిపై ఈ సెక్షన్ ఉండడం.. నిత్యం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, డివిజన్ అధికారులు ఈ రోడ్డు గుండా వెళ్తున్నా ఈ ట్రాన్స్ ఫార్మర్ల అంశంపై లైట్ తీసుకుంటున్నారు.

అంతే కాకుండా నెల క్రితమే విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఈ సెక్షన్ ను విజిట్ చేసినా ట్రాన్స్ ఫార్మర్ల అంశంపై పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇందుకు గల కారణం వారికి అందాల్సినని అందుతుండడమేనని తెలుస్తోంది. అంతే కాకుండా 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు దుమ్ము పట్టి పోతున్నాయి. కొన్ని నెలలుగా ఈ ట్రాన్స్ ఫార్మర్లు ఇక్కడే ఉన్నా అధికారులు పెట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కాగా ఈ ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించి పెపర్లు ఉన్నాయా లేవా అసలు ఇవి ఎక్కడివి అనే ప్రశ్నలతో పాటు ఈ ట్రాన్స్ ఫార్మర్లు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో నుంచి తీసినవిగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం జిల్లా విద్యుత్ శాఖ అధికారి, గజ్వేల్ డివిజన్ అధికారి ఇక్కడి నుంచి నిత్యం వెళ్తున్నా ఎస్పీఎంలో ఉండాల్సిన ట్రాన్స్ ఫార్మర్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించడం లేదని తెలుస్తోంది.