05-05-2025 01:39:24 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 5వ తరగతి గురుకుల సెట్-2025 ఫేజ్ -2 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫేజ్-1లో రెండు దఫాలు గా ఫలితాలు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్ల భర్తీకి ఫేజ్-2 ఫలితాలను ఆదివారం విడుదల చేసినట్లు సెట్ చీఫ్ కన్వీనర్ అలగు వర్షిణి తెలిపారు. అర్హులైన విద్యార్థులు జాబితా కోసం గురుకుల అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు. ఈ నెల 20వ తేదీలోగా వి ద్యార్థులు సంబంధిత ఇన్‌స్టిట్యూట్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు.