14-01-2026 01:14:48 AM
విజయ్ హజారే ట్రోఫీ
బెంగళూరు, జనవరి 13: విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ సెమీఫైనల్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్‌లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో విదర్భ 76 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్సి మ్రాన్ సింగ్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ల తో 88, అన్మోల్ ప్రీత్ సింగ్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 70, నెహాల్ వధేరా(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. రజత్ పటీదార్, త్రిపురేష్ సింగ్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో సన్విర్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ రమణ్దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీసారు. మయాంక్ మార్కండే ఒక వికెట్ తీసాడు.
మరో క్వార్టర్ ఫైనల్ లో
విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు300 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశ్ రాథోడ్ 73 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 86, అథర్వ టైడ్. 72 బంతుల్లో 8 ఫోర్లతో 62 హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత ఢిల్లీ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. అనుజ్ రావత్ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే మూడు వికెట్లు పడగొట్టాడు.