calender_icon.png 13 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

12-09-2025 11:22:03 PM

హనుమకొండ,(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్ లో ఆధునిక రిహాబిలిటేషన్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరంగల్‌లో ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం రోగులకు ఎంతో మేలు చేస్తుందని, ఇకపై మెట్రో నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే అత్యాధునిక రిహాబిలిటేషన్ సేవలు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన రోగులను పరామర్శించి, మెడికవర్ వైద్యులు చేస్తున్న సేవలను అభినందించారు.