20-08-2025 07:39:11 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, వైద్య సిబ్బంది, నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో పర్యటించారు. ఆసుపత్రి పరిసరాలను తనిఖీ చేసి పరిశీలించారు. పలు చోట్ల ఆసుపత్రి పరిశుభ్రతపై సిబ్బంది, పారిశుధ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఆడిటోరియం ను సందర్శించారు. ఆడిటోరియం పరిసర ప్రాంతం పరిశుభత పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎలాంటి చెత్త కనిపించకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.