20-08-2025 07:40:42 PM
అగమవుతున్న రైతులు
కామారెడ్డి (విజయక్రాంతి): రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు పొలాల్లో వరదనీరు చేరింది. పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామ శివారులోని ఎల్లయ్య చెరువు ఆయకట్టు పూర్తిగా నీటమునిగింది. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. దీంతో బుధవారం వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారి సురేష్(Agriculture Department Extension Officer Suresh) ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.