22-06-2025 08:55:51 PM
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(Munnuru Kapu Government Employees Association) ఆధ్వర్యంలో ఇటీవల ఎస్ఐగా పదోన్నతి పొందిన మామిడాల సూర్యనారాయణను ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, మున్నూరు సంఘ నాయకులు మున్నూరు కాపు సంఘా వసతి గృహం నందు ఆదివారం సత్కరించారు. సమాజానికి వారు చేసిన సేవలను, వారి వృత్తి నిబద్దతను కొనియాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు సెక్రటరీ శెట్టి రంగారావు, మున్నూరు కాపు వసతి సంఘం చైర్మన్ మేకల బిక్ష్మయ్య, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పెద్ద బోయిన నాగరాజు, సెక్రటరీ కర్నాటి సోమయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకం శ్యామ్ బాబు, ట్రెజర్ దేవిసెట్టి వెంకటేశ్వర్లు, సభ్యులు అచ్యుత్, యుగంధర్, వాకా చంద్రశేఖర్, వెంకట్, శాబాసు వెంకట రమణ, ఆకుల సత్యం పాల్గొని అభినందనలు తెలియజేశారు.