16-07-2025 12:10:48 AM
సీఎస్‌కు అందజేసిన తెలంగాణ విద్వత్సభ
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాబోయే పరాభవ నామ సంవత్సరంలో (2026 వ చ్చే పండుగల జాబితాను తెలంగాణ విద్వత్సభ మంగళవారం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు అందజేసింది. పండుగల విషయాల్లో ఏ విధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకై గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్ధాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండుగల తేదీలను నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పిస్తు న్నారు.
ఇదే విధంగా రాబోయే పరాభవ నామ సంవత్సర పండుగలను దాదాపు వందమంది సిద్ధాంతులు జులై 13న పుష్పగిరి జగద్గురు సంస్థానంలో నిర్వహించిన విద్వత్సభ స మావేశంలో ఖరారు చేశారు. ఈ పండుగలను జాబితాను తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సి ద్దాంతి ఆధ్వర్యంలో కోశాధికారి ఎం. వెంకటరమణ శర్మ, సమన్వయ కార్యదర్శి కమలాకర శర్మ, సమన్వయకర్త భీంసేన్ మూర్తి, బ్రాహ్మాణ్ ఎక్సలెన్స్ సెంటర్ చైర్మన్ విజయ్ ఒద్దిరాజులు సీఎస్‌కు అందజేశారు.