calender_icon.png 31 August, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కక్షిదారులకు సత్వర న్యాయమందించాలి

31-08-2025 01:00:22 AM

  1. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి
  2. హైకోర్టు న్యాయమూర్తులు  

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 30 : కోర్టుల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించాలని హైకోర్టు, జిల్లా పరిపాలనా న్యాయమూ ర్తి పుల్లా కార్తీక్ కోరారు.  శనివారం సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ, నాలుగో అంతస్తులో నూతనంగా నిర్మించిన రెండో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాలను హైకోర్టు న్యాయమూర్తులు కార్తీక్, బి.విజయసేన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆరా కన్వెన్షన్ హాల్లో  జ్యోతిప్రజ్వలన చేసి నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి కృషి చేసిన వారిని న్యాయమూర్తులు అభినందించారు.  న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారు అసంతృప్తితో  వెనుతిరగకూడదన్నారు. సిద్ధిపేట జిల్లా అద్భుతమైన ప్రగతిని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.   ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని సూచిం చారు. అప్పుడే హక్కులు, విధులు తెలుస్తాయని, ప్రశ్నించేతత్వం అలవడుతుందని, ప్రజాస్వామ్యంలో చురుకైన పాత్ర పోషించవచ్చని చెప్పారు.

అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసాపత్రాలను న్యాయమూర్తులు అందజేశా రు. జిల్లా న్యాయమూర్తులు, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పోలీస్ శాఖ అధికారులు హైకోర్టు న్యాయమూర్తులను శాలువా, మొమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి సాయిరమాదేవి, కలెక్టర్ కె.హైమావతి, పోలీస్ కమిషనర్ బి. అనురాధ, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహె జనార్దన్ రెడ్డి, కార్యదర్శి తాటికొండ రమేష్, న్యాయవాదులు రాములు, ప్రకాశ్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.