23-08-2025 01:31:48 AM
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష
- ప్రభుత్వ పథకాలే మన ప్రచారాస్త్రమన్న మంత్రి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి) : రాష్ర్ట రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నియోజకవర్గంలోని బూత్ స్థాయి కమిటీ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, విజ యాన్ని ఖాయం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు, కార్యక ర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలవాలన్నారు. ఉప ఎన్నిక ఫలితంపై యావత్ రాష్ర్టం దృష్టి సారించిందని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీలో కొత్త, పాత అనే భేదభావాలకు తావివ్వకుండా, అందరినీ కలుపుకొని సమన్వయం తో ముందుకు సాగాలని పిలుపుని చ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే మన గెలుపునకు పునాది అని మంత్రి స్పష్టం చేశారు. విద్య, వైద్యం, గృహనిర్మాణం, రైతు సంక్షేమం, మహిళాభ్యున్నతి, మైనారిటీలకు ఆర్థిక చేయూత వంటి ఎన్నో పథకాలను మన ప్ర భుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకాల లబ్ధిని, వాటి ఫలితాలను ఇంటింటికీ వెళ్లి వివరించి ఓటర్లను చైతన్యపరచాలి, అని ఆయన సూచించారు.
ప్రతి డివిజన్‌లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల జాబితాను సిద్ధం చేసి, రాబోయే పీఏసీ సమావేశం నాటికి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆయన నేతలను ఆదేశించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. ఈ ఉపఎన్నికలో గెలుపు సాధిం చి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఒక కొత్త దిశను నిర్దేశించాలి, అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సమావేశంలో రాష్ర్ట సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగ రాఘవ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ప్రొ. రియాజ్, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు