30-08-2025 01:51:08 AM
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి ): శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ సహకరించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి స మావేశాల నేపథ్యంలో నిర్వాహణ, వసతు లు, భద్రతా ఏర్పాట్లపై రాష్ర్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో శుక్రవారం అసెంబ్లీ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో లాగానే ఈసారి కూడా అధికారు లు సహకారమందించాలన్నారు. సభ్యు లు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వర గా అందించాలని ఆదేశించారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పు డు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులు అడి గిన సమాచారం అందిస్తూ సహకరించాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున జాగ్రత్తలు తీ సుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్నిమార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యు లు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరిం చాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని వాటిని అడ్డుకోవాలని ఆదేశించారు.
పూర్తి సహకారం అందిస్తాం: సీఎస్
చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడు తూ సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో డిప్యూటీ చైర్మన్ బం డా ప్రకాష్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. నరసిం హాచార్యులు, జీఏడీ సెక్రటరీ రఘనంందన్ రావు, అడిషనల్ సెక్రటరీ (ఫైనా న్స్)- రాయ రవి, డైరెక్టర్ (ప్రోటోకాల్)- శివలింగయ్య, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, డీజీపీ డాక్టర్ జితేందర్, ఏడీజీ మహేశ్ భగవత్, అడిషనల్ సీపీ- విక్రమ్‌సింగ్‌మాన్, సైబ రాబాద్, రాచకొండ కమిషనర్లు సుధీర్‌బా బు, అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఐజీ - కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్‌మార్షల్- కర్ణాకర్, కౌ న్సిల్ చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించాలి: మండలి చైర్మన్ గుత్తా
శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమధానాలను అధికారులు పంపించాల న్నారు. మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అ న్నిశాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని, అవసరమైన నోడ ల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సూచిం చా రు. సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు.