calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు నెరవేర్చే శక్తి ప్రభుత్వానికివ్వాలి

30-08-2025 01:59:56 AM

  1. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
  2. భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణకు నష్టం
  3. మంత్రి శ్రీధర్‌బాబు
  4. గణపతి హోమంలో పాల్గొన్న మంత్రి

మంథని, ఆగస్టు 29(విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దుష్టశక్తులను తరిమి వేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపేలా చూడాలని భగవంతుని ప్రార్థించానని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మంథనిలోని రావుల చెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని, రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని గణపతి హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. కాగా రాష్ర్టంలో అతివృష్టితో అనుకోకుండా భారీ వర్షాలు కురవడం వల్ల ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని, అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరి రైతాంగం నష్టపోయిందని అన్నారు.

నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొండ శంకర్,  నాయకులు శశి భూషణ్ కాచే, ఓడ్నాల శ్రీనివాస్, వనం రామచంద్రరావు, బివి స్వామి గౌడ్ ఆకుల కిరణ్, తోట చంద్రయ్య, దొడ్డ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.