calender_icon.png 24 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి

24-08-2025 12:33:12 AM

- మంత్రి పొన్నం ప్రభాకర్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి సమావేశం

హైదరాబాద్  సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయ క్రాంతి): త్వరలో జరగనున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని, తద్వారా కాంగ్రెస్ జెండా ను నియోజకవర్గంలో ఎగురవేయాలని మంత్రి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

శనివారం ప్రజాభవన్‌లో జూ బ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని, గెలుపు కోసం అనుసరించాల్సిన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మన ప్రభుత్వ పనితీరే మనకు శ్రీరామరక్ష. గత ప్రభుత్వాల మాదిరిగా మాటలు చెప్ప డం కాదు, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసి చూ పిస్తున్నాం.

ఈ సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేరవేసి, ప్రజల మద్దతును ఓట్లుగా మలచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, అని ఉద్ఘాటించారు.   ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలిస్తేనే నియోజకవర్గం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందనే వాస్తవాన్ని ప్రజలకు బలం గా వివరించాలని పొన్నం ప్రభాకర్ అన్నా రు. “ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుంది.

ప్రభుత్వంతో కలి సి పనిచేసే మన అభ్యర్థి గెలిస్తే, నియోజకవర్గ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారమ వుతాయి. ఇప్పటికే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 6 వేల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామంటే, ప్రజల సంక్షేమం పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు,అని ఆయన పేర్కొన్నారు.క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.