calender_icon.png 16 September, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత భావంతో పని చేయాలి

16-09-2025 01:19:44 AM

  1. నగర మేయర్ విజయలక్ష్మి

౩౨ మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మేయర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) :జీహెఎంసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అం డగా నిలుస్తూ, వారి వారసులు 32 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. సోమవారం జీహెఎంసీ ప్రధా న కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వారికి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ, అంకితభావంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా జీహెఎంసీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతన ఉద్యోగులకు సూచించారు. మీకు మంచి భవిష్య త్తు ఉంది. సానుకూల దృక్పథంతో, ఎలాం టి ఫిర్యాదులకు తావివ్వకుండా ఉత్తమ పనితీరు కనబరచాలి.

విధి నిర్వహణలో సమ యపాలన తప్పనిసరిగా పాటించాలి అని ఆమె హితవు పలికారు. మొత్తం 32 మందికి నియామక పత్రాలు అందజేయగా, వీరిలో 10 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, 17 మంది ఆఫీస్ సబార్డినేట్లుగా, మరో ఐదుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా వివిధ విభా గాల్లో పోస్టింగ్‌లు పొందారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు