31-10-2025 10:17:35 PM
మహబూబ్ నగర్ టౌన్: శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్ లో ఈనెల 2, 3 తేదీల్లో పౌరాణిక నాటకాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి వి.నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి మఠం ఆవరణలో నాటకోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 417వ జయంతి సందర్భంగా శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మయసభ దుర్యోధన ఏకపాత్రాభినయం, శ్రీకృష్ణ రాయబారం పూర్తి నాటకం, కౌరవ సభ, 3వ తేదీ వివిధ సంస్థలచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, బాలలచే మాకు స్వాతంత్య్రం కావాలి లఘునాటిక ఉంటాయని తెలిపారు. జిల్లాలోని కళాభిమానులు పారాణిక నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమిత్రకళానాట్య మండలి ఉపాధ్యక్షులు ప్రభాకరా చారి, పాండురంగాచారి, సంయుక్త కార్యదర్శి రాంచంద్రయ్య, భాస్కరా చారి, రామా చారి, విరాట్ల్చారి, మహేష్ చారి, తిరుపతయ్య, బి.కృష్ణయ్య, సుధాకారాచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.